ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి మనిషి మనసులోనూ ఇమిడి ఉండాల్సిన భావన , ప్రతి పనిని భగవాన్ నామస్మరణతో ప్రారంభిస్తే ఆ పని ఏ విఘ్నము లేకుండు సంపూర్ణం అయేట్లు ఆయనే చూసుకుంటాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పనికి అంటే ప్రతి కర్మకి వేదం ప్రమాణంగా ఉండాలని, ఆలా వేదం ప్రమాణంగా ఉన్న ప్రతి పని ధర్మము అవుతుంది అని ఎంతో మంది జ్ఞ్యాన కోవిదులు తెలియజేసారు, రుజువుచేసారు, ప్రపంచానికి పరిచయం కూడా చేసారు, అలంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకోవాలి, అవలింపుచేసుకోవాలి , ఆచరించి చూపించాలి.
వేదం గురించి చాగంటి కోటేశ్వర రావు గారి మాటలో విందాం , మనలాంటి పామరులకు అర్థంకాని అనేకమైన విషయాలను, సంస్కృతంలో గల కఠినమైన శ్లోకాలను ఆ "శారద పుత్రుడు" చాగంటి వారి మాటలలో సరళముగా, చెవులకు ఇంపుగా విని తరిద్దాం
మనం చేసే ప్రతి కర్మకి (పనికి) వేదం ప్రమాణంగా ఉంటుంది. ఒక ఉదాహరణకి పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమి వస్తుంది ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మిక విషయాల గురించి గొప్పగా చాగంటి వారు పై వీడియో లో అద్భుతంగా ఆవిష్కరణ చేసారు. ఇలాంటి వారు ఉన్నంత వరకు జ్ఞ్యానం సంపాదించాలి అనుకునే వారికీ లోటు ఉండదు.

No comments:
Post a Comment